శునకానికి పిల్లి మసాజ్..

శునకానికి పిల్లి మసాజ్..

జాతి వైరంలో పిల్లి,కుక్కలది అనాదిగా వస్తున్న జాతి వైరంలో ఒకటి.ఒక దాన్ని చూస్తే మరొకడు గిట్టదు.అయితే అప్పుడప్పుడు ఈ రెండు ఎంతో స్నేహంగా మెలగడం చూస్తుంటాం.ఇటువంటి ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.పిల్లి శునకానికి మసాజ్‌ చేస్తూ ఉన్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మార్జాలం మసాజ్‌ చేస్తుంటే శునకం హాయిగా సేదదీరుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.కుక్క, పిల్లి సావాసం ఇలాగే వర్థిల్లాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నవంబర్‌ 9న సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. దాదాపు 10వేలకుపైగా లైకులు వచ్చాయి. పిల్లి అలా తలమీద రుద్దుతూ ఉంటే శునకం వెలిబుచ్చిన హావభావాలు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos