‘ఫిమేల్ వయాగ్రా’ను అనుమతించిన ఈజిప్టు

‘ఫిమేల్ వయాగ్రా’ను అనుమతించిన  ఈజిప్టు

సామాజికంగా సంప్రదాయ దేశమైన ఇక్కడ ఈ మాత్రలకు ఎంత మార్కెట్ ఉందో తెలుసుకునే ప్రయత్నం .”ఈ మాత్ర వేసుకున్న తర్వాత నాకు అలసటగా అనిపిస్తుంది. నిద్ర వస్తున్నట్టు ఉంటుంది. గుండె వేగం కూడా పెరుగుతుంది” అని ఆ మాత్రను మొదటిసారి వినియోగించిన లైలా(పేరు మార్చాం) చెప్పారు. ఈ మాత్రను ‘ఫిమేల్ వయాగ్రా’ అంటారు. రసాయ పరిభాషలో అయితే ‘ఫ్లిబాన్సెరిన్’ అని పిలుస్తారు.అమెరికా మూడేళ్ల క్రితమే వీటిని ఉపయోగించడానికి అనుమతించింది. ఇప్పుడు ఈజిఫ్టులోని ఒక స్థానిక కంపెనీ ఈ మందును తయారు చేస్తోంది.లైలాకు సుమారు 30 ఏళ్లుంటుంది. ఆమె ఒక సంప్రదాయ కుటుంబంలో కోడలు. తన గుర్తింపును బయటపెట్టవద్దని ఆమె మమ్మల్ని కోరారు. ఎందుకంటే, ఈజిఫ్టులోని చాలా మంది మహిళల్లాగే లైంగిక సమస్యలు, లైంగిక అవసరాల గురించి బహిరంగంగా మాట్లాడటం తప్పు అని భావిస్తున్నారు.ఆమెకు పెళ్లై పదేళ్లైంది. దానిపై ఆసక్తి కలగడం వల్లే ఆ మందు కొన్నానని లైలా చెప్పారు.లైలాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కానీ, ఆమె ఈ మందును వైద్యుడి సలహా తీసుకోకుండానే ఉపయోగించారు. ఈజిఫ్టులో అలా వైద్యుల సలహా లేకుండానే మందులు వేసుకోవడం సర్వ సాధారణం. ఇక్కడ చాలా మంది డాక్టర్ సలహా లేకుండా నేరుగా దుకాణానికి వెళ్లి మందులు కొనుగోలు చేస్తుంటారు.”ఫార్మసిస్ట్ నాకు కొన్ని వారాల వరకు ప్రతి రాత్రీ ఒక మాత్ర తీసుకోవాలని చెప్పాడు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నాడు” అని లైలా చెప్పారు.”నేను, నా భర్త దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. ఒకసారి ప్రయత్నించా. కానీ ఇక ఆ మాత్ర ఎప్పుడూ వేసుకోను”.ఈజిఫ్టులో విడాకులు తీసుకునే వారి సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది. కొన్ని స్థానిక మీడియా కథనాల ప్రకారం దంపతుల మధ్య లైంగిక సమస్యలు దీనికి అతిపెద్ద కారణం అయ్యాయి.స్థానిక కంపెనీ ఫ్లిబాన్సెరిన్ తయారీదారులు మాత్రం దేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు మహిళల్లో కామోత్తేజం తక్కువ ఉంటుందని అన్నారు. కానీ ఇది ఒక అంచనా మాత్రమే. ఎందుకంటే ఈ దేశంలో ఈ వాదనకు సంబంధించి ఎలాంటి గణాంకాలూ లేవు.కంపెనీ ప్రతినిధి అష్రఫ్ అల్ మరాగీ ఈ మందు ఈజిఫ్టులో చాలా అవసరం అన్నారు.”ఈ మందు ఉపయోగించడానికి సురక్షితం, ఇది ప్రభావం చూపిస్తుంది. అందుకే అలసటగా, నిద్ర వచ్చినట్టు అనిపించినా, ఆ లక్షణాలు త్వరగా తగ్గిపోతాయి” అని మరాగీ చెప్పారు.అయితే చాలా మంది ఫార్మసిస్టులు, డాక్టర్లు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా చెబుతున్నారు.నేను మాట్లాడిన ఒక ఫార్మసిస్టు ఈ మందు వల్ల రక్తపోటు తగ్గిపోయి ‘ఆందోళనకర స్థాయి’కి చేరవచ్చని చెప్పారు. గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ మందుకు దూరంగా ఉండాలన్నారు.ఉత్తర కైరోలో ఫార్మసీ దుకాణం నిర్వహించే మురాద్ సాదిక్ దీని సైడ్ ఎఫెక్ట్స్ గురించి తన కస్టమర్లకు ఎప్పుడూ చెబుతానని కానీ వాళ్లు మందు కొనేలా ఒప్పిస్తానని కూడా చెప్పాడు

“రోజూ సుమారు పది మంది ఆ మందు కొనడానికి వస్తారు. వారిలో ఎక్కువ మంది మగవారే ఉంటారు. మహిళలు సిగ్గుతో దాన్ని కొనడానికి ముందుకు రారు” అని చెప్పారు.”ఫార్మసిస్ట్ నాకు కొన్ని వారాల వరకు ప్రతి రాత్రీ ఒక మాత్ర తీసుకోవాలని చెప్పాడు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నాడు” అని లైలా చెప్పారు.”నేను, నా భర్త దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. ఒకసారి ప్రయత్నించా. కానీ ఇక ఆ మాత్ర ఎప్పుడూ వేసుకోను”.ఈజిఫ్టులో విడాకులు తీసుకునే వారి సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది. కొన్ని స్థానిక మీడియా కథనాల ప్రకారం దంపతుల మధ్య లైంగిక సమస్యలు దీనికి అతిపెద్ద కారణం అయ్యాయి.స్థానిక కంపెనీ ఫ్లిబాన్సెరిన్ తయారీదారులు మాత్రం దేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు మహిళల్లో కామోత్తేజం తక్కువ ఉంటుందని అన్నారు. కానీ ఇది ఒక అంచనా మాత్రమే. ఎందుకంటే ఈ దేశంలో ఈ వాదనకు సంబంధించి ఎలాంటి గణాంకాలూ లేవు.కంపెనీ ప్రతినిధి అష్రఫ్ అల్ మరాగీ ఈ మందు ఈజిఫ్టులో చాలా అవసరం అన్నారు.”ఈ మందు ఉపయోగించడానికి సురక్షితం, ఇది ప్రభావం చూపిస్తుంది. అందుకే అలసటగా, నిద్ర వచ్చినట్టు అనిపించినా, ఆ లక్షణాలు త్వరగా తగ్గిపోతాయి” అని మరాగీ చెప్పారు.అయితే చాలా మంది ఫార్మసిస్టులు, డాక్టర్లు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా చెబుతున్నారు.నేను మాట్లాడిన ఒక ఫార్మసిస్టు ఈ మందు వల్ల రక్తపోటు తగ్గిపోయి ‘ఆందోళనకర స్థాయి’కి చేరవచ్చని చెప్పారు. గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ మందుకు దూరంగా ఉండాలన్నారు.ఉత్తర కైరోలో ఫార్మసీ దుకాణం నిర్వహించే మురాద్ సాదిక్ దీని సైడ్ ఎఫెక్ట్స్ గురించి తన కస్టమర్లకు ఎప్పుడూ చెబుతానని కానీ వాళ్లు మందు కొనేలా ఒప్పిస్తానని కూడా చెప్పాడు”రోజూ సుమారు పది మంది ఆ మందు కొనడానికి వస్తారు. వారిలో ఎక్కువ మంది మగవారే ఉంటారు. మహిళలు సిగ్గుతో దాన్ని కొనడానికి ముందుకు రారు” అని చెప్పారు.

అది ఆలోచన బట్టి ఉంటుంది

మురాద్ సాదిక్ ఫార్మసీలో నాకు ఒక ప్రకటన కనిపించింది. అందులో ఫ్లిబాన్సెరిన్ ‘గులాబీ మాత్ర’ అని చెప్పారు. దీన్ని ‘నీలం మాత్ర’కు ఫిమేల్ ఎడిషన్‌గా చెప్పారు. ఈజిఫ్టులో పురుషుల వయాగ్రాను ‘నీలం మాత్ర’ అంటారు.కానీ ఈ మందు ఉత్పత్తి దారులు మాత్రం దీనిని ‘ఫిమేల్ వయాగ్రా’ అనడం తప్పంటున్నారు. మీడియానే దీనికి అలాంటి పేరు పెట్టిందని మరాగీ చెప్పారు.పురుషుల వయాగ్రా పెనిస్‌లో రక్త ప్రవాహం పెంచి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ సరి చేస్తుంది. అదే మహిళల్లో ఫ్లిబాన్సెరిన్ మెదడులో కెమికల్ బ్యాలెన్స్ చేసి వాటిలో యాంటీ డిప్రెజెంట్ ఔషధం, లైంగిక కోరికలు పెంచే పనిచేస్తుంది.సెక్స్ థెరపిస్ట్ హీబా కౌతుబ్ తన దగ్గరకు వచ్చే రోగులకు ఈ మందు సూచించనని చెప్పారు. ఆమె దీనిని ‘ఫిమేల్ వయాగ్రా’ అనడం తప్పంటున్నారు.”శారీరక, మానసిక సమస్యలు ఉన్న మహిళలకు ఈ మందు ఎప్పటికీ పనిచేయడం ఉండదు””మహిళలకు సెక్స్ అనేది ఒక భావోద్వేగ ప్రక్రియ. వారికి ఆలోచన అనేది ముఖ్యం. ఒక భర్త భార్యతో చెడుగా ప్రవర్తిస్తే, ఆమె అతడితో ఎప్పటికీ ఆరోగ్యకరమైన శారీరక సంబంధాలు కొనసాగించలేదు. అలాంటప్పుడు ఇలాంటి ఏ మందులూ ఉపయోగపడవు” అని కౌతుబ్ చెప్పారు.

వివాహ బంధంలో చిచ్చు

“ఫ్లిబాన్సెరిన్ వల్ల ప్రయోజనాలు చాలా తక్కువ. అవి వేసుకుంటే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్టే అవుతుంది. రక్తపోటు తగ్గిపోవడం వల్ల తీవ్ర సమస్యలు రావచ్చు” అని హెచ్చరించారు.ఈజిఫ్టు మహిళలకు లైంగిక సమస్యల గురించి ఓపెన్‌గా మాట్లాడడానికి ఇంకా సుదీర్ఘ సమయం పడుతుంది.పెళ్లైన తర్వాత ఒత్తిడి, లైంగిక సంబంధాల్లో అసంతృప్తితో విడాకుల కోసం అప్లై చేసిన చాలా మంది మహిళలు తనకు తెలుసని లైలా చెప్పారు.”లైంగిక సంబంధాల విషయంలో భర్త బలహీనంగా ఉంటే భార్యలు వారికి సాయం చేయవచ్చు. చికిత్స చేయించవచ్చు. కానీ వారు భార్యలను ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే అది సాధ్యం. కానీ భర్తలు వారిని హింసిస్తుంటే, భార్యలకు స్వయంగా అలాంటి వాటిపై ఆసక్తి తగ్గిపోతుంది. అలాంటప్పుడు భర్తల్లో సామర్థ్యం ఉన్నా, ఎలాంటి తేడా ఉండదు. కానీ మగవాళ్లు ఈ సున్నితమైన విషయాలు అర్థం చేసుకోరు” అంటారు లైలా.అయితే ఫ్లిబాన్సెరిన్ అమ్మకాలు మొదలై ఇంకా ఎక్కువ రోజులు కాలేదు. కానీ దాని తయారు చేసే మురాద్ సాదిక్ దీని డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. కౌతుబ్ లాంటి వారు ఈ మందు వల్ల వివాహాలపై పడే ప్రభావం తలుచుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.”ఎవరైనా పురుషులు ఈ మాత్ర వేసుకున్నా తమ భార్యలో కామోత్తేజం కలగలేదని గమనిస్తే అప్పుడు వారు తప్పు మహిళలపైనే వేస్తారు. ప్రభావం చూపని మందు గురించి, తమ బంధం గురించి వారు పట్టించుకోరు. ఈ మందు వల్ల భర్తలు తమ భార్యను వదిలేయడం కూడా చేయవచ్చు. అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos