పీఎస్ఎల్ వీ 44 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ

పీఎస్ఎల్ వీ 44 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో రేపు ఉదయం 11 గంటల 37 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ– సీ 44 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు. కాగా, ఈ ఏడాది అంతరిక్షంలోకి 17 శాటిలైట్స్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. వరుసగా ఉపగ్రహ ప్రయోగాలతో ఇస్రో చరిత్ర సృష్టిస్తోంది. ఇటీవలే జిఎస్‌ఎల్వీ ప్రయోగం కూడా విజయవంతంగా చేపట్టింది. ఇప్పటికే మానవసహిత ప్రయోగానికి సిద్దమవుతోంది. 2022 నాటికి ఈ ప్రయోగం చేపట్టనుంది. రేపు ప్రయోగించబోతున్న ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos