జోల పాటలు తల్లికి లాభమే

జోల పాటలు  తల్లికి లాభమే

ప్రసవం తర్వాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు.సాధారణంగా ప్రసవం తర్వాత చాలామంది మహిళలు ఒకరకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు. ఆందోళన పడుతుంటారు.అయితే… పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది.అందులోనూ ఒంటరిగా కాకుండా.. గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపే మహిళలల్లో మరీ తొందరగా మార్పు వస్తుందని పరిశోధకులు గుర్తించారు.ప్రతి ఎనిమిది మంది బాలింతల్లో ఒకరు కుంగుబాటుకు గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది.గతంలో వయసు పైబడిన వారు పాటలు పాడుతూ డెమెన్షియా వంటి మానసిక రుగ్మతుల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించాయి.బాలింతలకూ పాటలు మందుగా పనిచేస్తాయని చెప్పిన తొలి అధ్యయనం ఇదే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos