జనసేనలో చేరిన తమిళనాడు మాజీ సీఎస్‌..

జనసేనలో చేరిన తమిళనాడు మాజీ సీఎస్‌..

జ‌న‌సేన అధినేతకు రాజకీయ సలహాదారుడిగా సీనియ‌ర్ ఐఏయ‌స్ ..రిటైర్డ్
ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నియ‌మితుల‌య్యారు. ఎన్నిక‌లు స‌మీపి స్తున్న వేళ జ‌న‌సేన
లోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే రిటైర్డ్ ఐఏయ‌స్ తోట చంద్ర‌శేఖ‌ర్ జ‌న‌సేన
ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. తాజాగా, మ‌రో సీయ‌స్ జ‌న‌సేన లో చేర‌టంతో పార్టీ కొత్త
రూపు సంత‌రించుకుంటోంది. జ‌న‌సేలో చేరిన రామ్మోహ‌న‌రావు.. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన
కార్యదర్శి పీ రామ్మోహన్‌రావు జనసేన పార్టీలో చేరారు. ఆయన జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు
రాజకీయ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.
అన్నాడీఎంకే ప్రభుత్వం హయాంలోతమిళనాడు ప్రభుత్వ సీఎ్‌సగా రామ్మోహన్‌ రావు పనిచేశారు.
అప్పటి సీఎం జయ లలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ప్రభుత్వాన్ని
సమర్థవంతంగా నడిపారు.
అలాంటి గొప్ప వ్యక్తి పార్టీపైన, నాపైన నమ్మకంతో
అండగా నిలబడ్డానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన విలు వైన సలహాలు, సూచనలతో ఏపీకి బంగారు
భవిష్యత్తును అందిస్తాం అని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. పార్టీ లో చేరిన రామ్మో హ‌న రావు
సైతం ప‌వ‌న్ పై అభిమానం చాటుకున్నారు. మానవసేవే మాధవసేవ అని నమ్మిన పవన్‌ కల్యాణ్‌
యువకు లు, మహిళలు, బడుగు, బలహీనవర్గాల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నార‌ని రామ్మోహన్‌
రావు కొనియాడారు. పార్టీ వైపు మేధావులు.. జ‌న‌సేన కొత్త పార్టీ అయినా ఇప్ప‌టికే ఆ పార్టీ
ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రిటైర్డ్ ఐఏయ‌స్ తోట చంద్ర‌శేఖ‌ర్ ఉన్నారు. ఆయ‌న గ‌తంలో ప్ర‌జారాజ్యం
పార్టీలోనూ కీల‌క భూమిక పోషించారు. ప్ర‌జారాజ్యం నుండి గుంటూరు ఎంపీగా పోటీ చేసారు.
ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన లో క్రియా శీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ..ఈ సారి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన
అభ్య‌ర్ది గుంటూరు ప‌శ్చిమం నుండి పోటీ చేస్తున్నారు.
తాజాగా పార్టీలో చేరిన రామ్మోహ‌న్ స్వ‌స్థ‌లం ఏపిలోని
ప్ర‌కాశం జిల్లా. ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టం కంటే..పార్టీకి సేవ‌లు
అందించాల‌ని భావిస్తున్నారు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రిగిన రాజ‌కీయ ఆటు పోట్లు ప్ర‌త్య‌క్షంగా
చూడ‌ట‌మే కాకుండా.. ప‌రిపాల‌న లో సుదీర్ఘ అనుభ‌వం ఉంది. ఇప్పుడు ప‌వ‌న్ కు రాజ‌కీయ
స‌ల‌హాదారుడి గా ఆయ‌న జ‌న‌సేన లో కొత్త బాధ్య‌త‌లు చేప‌డుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos