కేటీఆర్‌ను ఆహ్వానించిన ఒమర్ అబ్దుల్లా

హైదరాబాద్‌: ‘మా ఇంటిని మీ ఇల్లే అనుకోండి.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఉండండి’ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఆహ్వానించారు జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్ అబ్దుల్లా. ఇంతకీ వీరి మధ్య ఈ సంభాషణ ఎలా వచ్చిందంటే..ఒమర్‌ అబ్దుల్లా బుధవారం తన ఇంటి ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు. మంచు అందాల నడుమ ఉన్న ఇంటి ఫొటోను చూడగానే కేటీఆర్‌కు బాగా నచ్చేసినట్లుంది. వెంటనే ఒమర్‌ ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘ఒకవేళ కోరికలు నెరవేర్చే ఫ్యాక్టరీ గనుక ఉంటే.. నేను ఈ క్షణమే అక్కడ ఉండేవాడిని’ అని ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్‌ చూసిన ఒమర్‌.. కేటీఆర్‌ను సాదరంగా తన ఇంటికి ఆహ్వానించారు. ‘మా ఇంటిని మీ ఇల్లే అనుకోండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఉండొచ్చు’ అని ఒమర్ ఆహ్వానం పలికారు. ఇందుకు కేటీఆర్‌.. ‘ఒమర్‌ సాబ్‌ మీ ఆఫర్‌ను నేను సీరియస్‌గానే తీసుకుంటాను మరీ..’ అని నవ్వుతూ బదులిచ్చారు.ఓవైపు తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతుంటే.. కేటీఆర్‌.. ఒమర్‌ మధ్య సంభాషణ తాజాగా ఆసక్తికరంగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos