ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం 2018లో చేసిన నూతన సవరణలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎస్సీ ఎస్టీలపై వేధింపులకు పాల్పడిన వారిని ఎలాంటి విచారణ లేకుండానే అరెస్టు చేసేందుకు ఈ సవరణ చట్టం అనుమతిస్తోంది. కాగా  ఈ చట్టంలోని సవరణలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లతో పాటు గతేడాది మార్చి 20న సుప్రీం ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను కలిపి ఒకేసారి విచారించనునున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి చేసిన కొత్త సవరణలు న్యాయవిరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్లు కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గతేడాది మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో… ఈ తీర్పును పక్కనబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9న సవరణ బిల్లును ఆమోదించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos