అధిక బ‌రువు త‌గ్గాలంటే.

అధిక బ‌రువు త‌గ్గాలంటే.

అధిక బ‌రువు త‌గ్గాలనుకుంటున్నారా ? అయితే శాకాహారం మాత్ర‌మే తీసుకోండి. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టులే చెబుతున్నారు. శాకాహారం తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేస్తాయ‌ని, దీంతో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉండ‌డంతోపాటు అధిక బ‌రువును కూడా త‌గ్గించుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే వారు అధిక బ‌రువు త‌గ్గేందుకు శాకాహార డైట్‌ను సూచిస్తున్నారు. శాకాహార డైట్‌ను ఫాలో అయ్యేవారు జంతు సంబంధ ప‌దార్థాల‌ను పూర్తిగా మానేయాలి. అంటే చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, కోడిగుడ్లు, ఆఖ‌రికి పాలు, పాల సంబంధ ప‌దార్థాలు, తేనెను కూడా పూర్తిగా మానేయాలి. ఇక కింద చెప్పిన విధంగా మూడు పూట‌లా భోజ‌నం ప్లాన్ చేయాలి. 

బ్రేక్‌ఫాస్ట్

శ‌రీరానికి శ‌క్తినికి అందించ‌డంలో బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్య‌మైంది. క‌నుక బ్రేక్‌ఫాస్ట్‌ను ఎప్పుడూ మాన‌కూడ‌దు. అందులో ఒక పండు లేదా వెజిట‌బుల్ స‌లాడ్ క‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే న‌ట్స్‌, ఓట్ మీల్‌, శాండ్ విచ్‌, క్వినోవా, ఫ్రూట్ స్మూతీ, సోయా, బాదం మిల్క్ తీసుకోవాలి.

మ‌ధ్యాహ్నం భోజ‌నంలో కూర‌గాయ‌లు, ప‌ప్పులు, అన్నం, గోధుమ పిండి లేదా చిరు ధాన్యాల‌తో చేసిన రొట్టెలు, చిక్కుడు జాతి గింజ‌లు, కూర‌గాయ‌ల స‌లాడ్‌, న‌ట్స్‌, సీడ్స్ తీసుకోవ‌చ్చు. దీంతో ప్రోటీన్లు స‌రిగ్గా అందుతాయి.  డైట్‌ను పాటిస్తే ఎవ‌రైనా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos