అవి యతి పాదముద్రలు కావు

అవి  యతి పాదముద్రలు కావు

న్యూఢిల్లీ: యతి పాదముద్రలు ఇవేనంటూ పదాతి దళం విడుదల చేసిన ఫొటోల గురించి భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులు విభిన్న వాదనలు వినిపి స్తున్నారు. ‘భారత ఆర్మీ ప్రకటించిన ఫోటోలపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రకృతిలో అప్పుడప్పుడు వింతలు, మిస్టరీలు చోటు చేసుకుంటాయి., విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలు దొరికేవరకు దీనిని నిర్ధారణ చేయకపోవడమే మంచిది. దీనిపై మరింత చర్చ జరగాల్సిన అవసరముందని బాంబే నేచురల్ హిస్టరీ సోసైటీ (బీఎన్హెచ్ఎస్) డైరెక్టర్ దీపక్ ఆప్తే ఆయన పేర్కొన్నారు. బీఎన్హెచ్ఎస్ దేశంలోని ప్రకృతిపరమైన పరిశోధనలు నిర్వహించే అత్యున్నత సంస్థ . ఆర్మీ ప్రచురించిన ఫొటోల్లోని పాదముద్రలు యతివి కాకపోయి ఉండవచ్చునని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్, కోతి జాతులపై పరిశోధనలు జరుపుతున్న అనింద్య సిన్హా అభిప్రాయపడ్డారు. తాజా మంచు మీద హిమాలయకు చెందిన గోధుమ రంగు ఎలుగు బంట్ల పాద ముద్రలు అవి అయి ఉంటాయని పేర్కొన్నారు. ‘కొన్నిసార్లు ఈ ఎలుగుబంట్లు వెనుక కాళ్ల మీద ఆధారపడి నడుస్తాయి. దీంతో వీటి పాదముద్రలు అచ్చంగా యతిని తలపించేలా ఉంటాయి. ఇవి వీటిని చూసినవారు ఇవి యతి పాదముద్రలే అయి ఉంటాయని అనుకుంటారు’ అని వివరించారు. శాస్త్రవేత్తలే కాదు పలువురు నిపుణులు, పరిశోధకులు, నెటిజన్లు సైతం ఆర్మీ ప్రకటించిన ఫొటోల్లోని పాదముద్రలు యతివి కావని అభిప్రాయపడుతున్నారు. భారీ కాయంతో నిటారుగా ఎలుగబంటిని పోలి ఉండే యతి రెండు కాళ్లతో నడుస్తుంది. ఒకే పాదంతో అడుగులు వేసినట్లు ఈ ఫొటోల్లో ఉందని, ఈ పాదముద్రలు యతివి కాకపోయి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos