కాగేరి సూచనకు యత్నాళ్‌ ఆక్షేపణ

కాగేరి సూచనకు యత్నాళ్‌ ఆక్షేపణ

ప్రజావాహిని – బెంగళూరు

విధానసభ ప్రశ్నోత్తర వేళలో సభ్యులు ఎవ్వరూ మంత్రుల్ని కలసు కోరాదని సభాపతి విశ్వేశ్వర హెగ్డే  కాగేరి చేసిన సూచనను  భాజపా తిరుగుబాటు సభ్యుడు  బసవ గౌడ పాటిల్‌ యత్నాళ్‌   ఆక్షేపించారు. ‘మీరు మంత్రుల్ని సభలో కలుసుకోవద్దంటారు. వాళ్లు మాతో మాట్లాడరు. అందుకు సమయం లేదంటారు. నియోజక వర్గ సమస్యల్ని వారి ఎప్పుడు చెప్పాలి. పార్లమెంటు సమావేశాలపుడు  మంత్రుల్ని  సభ్యులు కలుసుకునేందుకు వేళను కేటాయిస్తారు. అదే మాదిరి ఇక్కడా ఉండాల’ని కోరారు. ‘ దీని గురించి మీరు  శాసనభా పక్ష సమావేశంలో తీర్మానించుకోండ’ని కాగేరి ఘాటుగా బదులిచ్చారు.  ఉదయం సభ ఆరంభమైనపుడు గుండ్లుపేట సభ్యుడు నిరంజనకుమార్‌ ప్రశ్నకు బదులివ్వాల్సిన అటవీ మంత్రి ఉమేశ్‌ కత్తి సభకు గైరుహాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన కాగేరి చీఫ్‌విప్‌ సతీశ్‌ రెడ్డిన ప్రశ్నించారు. ‘ కాస్త ఆలస్యంగా రానున్నారు. త్వరలోనే వచ్చేస్తార’ని బదులిచ్చారు. అలా ఆలస్యంగా ఎందుకు వస్తారు. సకాలంలోనే రావాలికద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos