ఐపీఎల్ కోసం ప్రపంచకప్ వాయిదా వేస్తామంటే అంగీకరించం..

  • In Sports
  • May 28, 2020
  • 170 Views
ఐపీఎల్ కోసం ప్రపంచకప్ వాయిదా వేస్తామంటే అంగీకరించం..

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 తేదీ వరకు నిర్వహించాలనుకున్న టీ20 ప్రపంచకప్ వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం వెలువడనుంది. అన్ని దేశాల బోర్డు సభ్యులతో నిర్వహించనున్న టెలీ కాన్ఫరెన్స్ అనంతరం ఐసీసీ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ప్రపంచకప్ వాయిదా పడడంతో అక్టోబర్ నవంబర్ నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణకు మార్గం లభించినట్టు అయ్యింది. అయితే ప్రపంచకప్ వాయిదా వేయడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తొందరపాటు నిర్ణయమని పాకిస్తాన్ పేర్కొంది. పరిస్థితులను ఆలోచించుకుని టోర్నీ నిర్వహణపై ఆలోచనలు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. క్రికెట్ క్యాలెండర్ ప్రకారం పాక్ విండీస్ జట్లు ఇంగ్లండ్లో సిరీస్ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచకప్ వాయిదా తో సిరీస్ లేకపోయే అవకాశం. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కోసం ప్రపంచకప్ వాయిదా వేస్తామంటే అంగీకరించమని పాక్ ప్రకటించింది. ఐసీసీ ఈవెంట్స్ ద్వైపాక్షిక సిరీస్లకు మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాక్‌ క్రికెట్‌ బోర్డు అభిప్రాయాలకు, నిర్ణయాలకు ఐసీసీలో ఏమాత్రం ప్రాధాన్యత దక్కదు.ఎందుకంటే ఐసీసీకి వచ్చే ఆదాయంలో సింహభాగం బీసీసీఐ నుంచే వస్తోంది.దీంతో ఐసీసీలో బీసీసీఐదే కీలకపాత్ర కావడంతో బీసీసీఐకి ఐసీసీ ఎదురు చెప్పే ధైర్యం చేయలేదు.ఈ పరిస్థితుల్లో పాక్‌ క్రికెట్‌ బోర్డు చేసిన వ్యాఖ్యలు చీపురు పుల్లలతో సమానమే భావించాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos