బద్దలవుతున్నకల్కి రహస్యం..

బద్దలవుతున్నకల్కి రహస్యం..

సాధారణ ఎల్ఐసీ ఏజెంట్ వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన వైనం వెనుక ఉన్న మిస్టరీ అర్థంకాక ఆయన భక్తులే కాదు, సామాన్యులు జుత్తు పీక్కుంటున్నారు.తాను భగవంతుని పదో అవతారంగా చెప్పుకుంటూ భక్తుల బలహీనత నుంచి రాబట్టుకున్న డబ్బుతో కోట్లకు పడగలెత్తినట్టు బయటపడుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ దాడులతో ఈ రహస్యం బద్దలవుతుండడంతో కల్కి దంపతుల అసలు స్వరూపం ప్రపంచానికి తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మూడు రోజులుగా దాడులు చేస్తున్న అధికారులు మొదటిరోజే కళ్లు బైర్లు కమ్మే విధంగా కోట్లు విలువ చేసే ఆభరణాలు,నగదు స్వాధీనం చేసుకున్నారు.మొదటిరోజే రూ.43.9 కోట్లు నగదు,రూ.18 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు, రూ.26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారం, రూ.5 కోట్ల విలువ చేసే 1271 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి. లెక్క తేలని ఆదాయం మరో రూ.500 కోట్ల వరకు ఉంటుందని ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు.కల్కి అనుబంధ సంస్థలు చైనా, అమెరికా, సింగపూర్, యూఏఈల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు గుర్తించారు. దేశీయంగా కల్కి సంస్థలు నిర్వహిస్తున్న కోర్సులకు దేశవిదేశాల నుంచి క్లయింట్లు హాజరవుతుంటారు.రాజకీయాలను సైతం శాసించే స్థాయిలో ఉన్న కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు జరగడంతో దేశంలోని మిగతా స్వాముల్లో గుబులు రేపుతోందట.. హిందుత్వానికి ఫేవర్‌గా ఉండే బీజేపీ ఇలాంటి దాడులకు పురిగొల్పడమే ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు కల్కి భగవాన్ ఖేల్ ఖతం చేసిన ఐటీ అధికారులు నెక్ట్స్ ఎవరిని టార్గెట్ చేస్తారన్న చర్చ సాగుతోంది.ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిన స్వాములు – మఠాలు – ఆశ్రమాలు ఎక్కువైపోయాయి. రోజుకో స్వామి పుట్టుకొచ్చి దేవుడిగా ప్రకటించుకుంటూ వేలకోట్ల అధిపతులు అయిపోతున్నారు. ఆధ్యాత్మిక సేవ అంటూ నిస్వార్థంగా చేస్తామంటూ దండుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. తెలుగు నాట అయితే సీఎంలను కూడా రప్పించుకొని వారిని రాజకీయాధికారం లోకి తీసుకొచ్చామంటూ నెత్తిన కూర్చుంటున్న స్వాముల సంగతి తెలిసిందే..కల్కి భగవాన్ ఖేల్ ఖతం చేసిన ఐటీ అధికారులు నెక్ట్స్ ఏ స్వామిని టార్గెట్ చేశారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలోని మరో ప్రముఖ స్వామి ఆశ్రమాల పై కూడా దాడులకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఓ ముఖ్యనేతకు సన్నిహితంగా ఉండే స్వామీజీని కూడా బీజేపీ సర్కారు టార్గెట్ చేసిందన్న ప్రచారం సాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos