చెంపదెబ్బ కొట్టిన వరుడు- పెళ్లి ఆపేసిన వధువు

చెంపదెబ్బ కొట్టిన వరుడు- పెళ్లి ఆపేసిన వధువు

కడలూరు: బన్రుట్టి పట్టణంలో వివాహం అర్ధంతరంగా ఆగి పోయింది. తెల్లారితే పెళ్లి అనగా వివాహం ఇష్టం లేదని వధువు ప్రకటించింది. ఆమె మాటను తల్లిదండ్రులు కాదనలేకపోయారు. జనవరి 20న పెళ్లి నిశ్చయించారు. దానికి  ముందు రోజు సాయంత్రం రెండు కుటుంబాలు కలిసి సంగీత్  నిర్వహించాయి. బంధువులు, స్నేహితులతో వధువు డ్యాన్స్ చేసింది. దీంతో వరుడు పెళ్లి కూతురును డ్యాన్స్ ఆపమన్నాడు. వేదిక  పైకి పిలిచాడు. రాగానే ఆమెను గట్టిగా లాగి చెంప దెబ్బ కొట్టాడు. దీంతో పెళ్లి ఆపేయాలని వధువు అమ్మానాన్నలకు చెప్పింది. కూతురు కోరిన విధంగా తల్లిదండ్రులు పెళ్లి ఆపేసారు. తర్వాత సమీప బంధువుతో ముందుగా నిశ్చియించిన ముహు ర్తానికే పెళ్లి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos