తగ్గట్టిలో శిథిలావస్థకు చేరుకున్న నీటి ట్యాంకు

తగ్గట్టిలో శిథిలావస్థకు చేరుకున్న నీటి ట్యాంకు

హోసూరు : కృష్ణగిరి జిల్లా ఉరిగం సమీపంలోని తగ్గట్టి గ్రామంలో తాగునీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. తగ్గట్టి గ్రామంలో సుమారు 150 కుటుంబాలున్నాయి. 20 ఏళ్ల క్రితం తాగునీటి కిసాన్ ట్యాంకును నిర్మించి, దీని ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ట్యాంకు శిథిలావస్థకు చేరుకోవడంతో రంధ్రాలు ఏర్పడి నీరు మొత్తం కారిపోతున్నది. గ్రామంలో నీటి ట్యాంకు ఎప్పుడు కూలిపోతుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ట్యాంకును కూల్చి కొత్తగా ట్యాంకును నిర్మించాలని అధికారులకు తెలిపినా పట్టుంచుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలిపోయే స్థితిలో ఉన్న ట్యాంకు సమీపంలో కొత్తగా తాగునీటి ట్యాంకును నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos