జైసల్మేర్‌లో కుప్పకూలిన వాయుసేన నిఘా విమానం

జైసల్మేర్‌లో కుప్పకూలిన వాయుసేన నిఘా విమానం

న్యూ ఢిల్లీ : ఇండియన్ ఎయిర్ఫోర్స్ కు చెందిన ఓ గూఢచారి విమానం ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. సాధారణ శిక్షణా సమయంలో విమానం ప్రమాదానికి గురైనట్లు తెలిపింది. జైసల్మేర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధని జాజియా గ్రామంలో ఓ బహిరంగ ప్రదేశంలో విమానం కూలి పోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, వైమానిక దళ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ విమానాన్ని ఏఐఎఫ్ నిఘా, గూఢచారి కార్యకలాపాలు నిర్వహించేందుకు వినియోగి స్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos