తొలి ద‌శ పోరులో బెంగాల్‌, మ‌ణిపూర్‌లో చెల‌రేగిన హింస‌

తొలి ద‌శ పోరులో బెంగాల్‌, మ‌ణిపూర్‌లో చెల‌రేగిన హింస‌

న్యూ ఢిల్లీ : లోక్సభ ఎన్నికల తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్ధానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో హింస ప్రజ్వరిల్లింది. కూచ్బెహర్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించారని టీఎంసీ ఆరోపించింది. సితాల్కుచిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ మద్దతుదారులు దౌర్జన్యానికి తెగబడి ఓటర్లను సైతం బెదిరించారని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఇక మణిపూర్లోని తమన్పోక్కి పోలింగ్ కేంద్రం వద్ద దుండగులు కాల్పులు జరపడంతో కలకలం రేగింది. హింస చెలరేగినా ఇప్పటివరకూ మణిపూర్లో 27.74 శాతం, పశ్చిమ బెంగాల్లో 33.56 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు తమిళనాడులో 39 లోక్సభ స్ధానాలకు తొలి దశలో ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో విపక్ష ఇండియా కూటమి డీఎంకే ప్రాబల్యాన్ని నిలువరించేందుకు ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేపట్టడంతో ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధిస్తామని కాషాయ పార్టీ ఆశలు పెంచుకుంది. ఇక బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పోరాడుతుండగా విపక్ష ఇండియా కూటమి పాలక ఎన్డీయే కూటమికి దీటైన పోటీ ఇచ్చేందుకు చెమటోడుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos