శ్రీమంతుల కొమ్ముకాసే ఖాకీలు

శ్రీమంతుల కొమ్ముకాసే ఖాకీలు

హైదరాబాద్:‘సామాజిక కార్యకర్తల్లా ఉండాల్సిన పోలీసులు డబ్బు, అధికారం ఉన్నవాళ్లతోనే స్నేహంగా ఉంటున్నారు. శిక్షణ కేంద్రాలు చెత్త కుప్పలుగా మారాయ’ని పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘పోలీసులు చట్టానికి, న్యాయానికి మాత్రమే తప్ప ప్రభుత్వానికి జవాబుదారీ కాదు. అకాడమీలో ఇస్తున్న శిక్షణ క్షేత్ర స్థాయి విధుల నిర్వహణకు పనికి రావటం లేదు. పోలీసు శిక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయం చేస్తున్న రూ.కోట్లాదిగా వృధా అవుతోంది. పోలీస్ అకాడమీలు పాఠశాలలు, కళాశాలలవంటివి కావు. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. పోలీసులు చెప్పింది ప్రజలు వింటారు. కానీ ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేద’ని వ్యాఖ్యానించారు. ‘శిక్షణ పొందిన అధికారులు పోలీసు శాఖకు మంచి పేరు తేవటం లేదు. ప్రజల కోసం పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రజల నుంచి గుర్తింపు రావడం లేదు. శిక్షణలోని లోపమే దీనికి కారణం. బ్రిటీష్ కాలం ఆనవాయితీ ఇంకా పోలీస్ శాఖలో కొనసాగు తోంది. కేవలం డబ్బు ఉన్నవారికి మాత్రమే పోలీసులు పని చేస్తున్నారు. జైల్లో ఉన్నవారు 90 శాతం బీదవారే. కొందరికి కనీసం తాము ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో జైలుకి వచ్చామో కూడా తెలియద’ని వాపోయారు. జైలుకు వచ్చిన నేరగాళ్లు తోటి ఖైదీలను చూసి నేరాల్లో కొత్త పద్ధతులను నేర్చుకుంటు న్నారన్నారు. పోలీస్ అంటే కేవలం బిల్డర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదని, వికలాంగుడైనా పోలీస్ కావొచ్చన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos