ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు

తిరుమల: మా ఎన్నికలకల్లో ఓడి పోయిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా లేఖలు తమకు ఇంకా అందలేదని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. రాజీనామా చేసిన విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందన్నారు. తండ్రి మోహన్బాబు, ప్యానెల్ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.‘ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా లేఖలు తమకు ఇంకా అందలేదుజ అవి అందిన తర్వాతే వాటిపై స్పందిస్తాను. ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నికల్లో విజయం కోసం తన ప్యానెల్ ఎంతో కష్టపడింది. స్వామివారి ఆశీస్సుల కోసమే ఇక్కడికి వచ్చాము. అసోయేషన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తాన’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos