తల్లిని ఢీకొట్టాడని బుడ్డోడి కోపం చూడండి..

తల్లిని ఢీకొట్టాడని బుడ్డోడి కోపం చూడండి..

తమ ఫీలింగ్స్‌ను వ్యక్తపరచడంలో చిన్నపిల్లలు ఎప్పటికీ ప్రత్యేకమే.అందులోనూ తమ తల్లికి ఏదైనా ప్రమాదం జరిగితే చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోతారు. సినిమాల్లో హీరోల్లా తమ హీరోయిజాన్ని చూపుతారు. తన తల్లికి కష్టం రావడానికి కారకులైన వారిపై తిరగబడతారు. అలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.చైనా దేశంలోని చాంగ్ కింగ్ లో బుడ్డోడు తన తల్లితో కలిసి జిబ్రాక్రాసింగ్ మీదుగా రోడ్డును దాటుతున్నాడు. అంతలో ఒక కారు వచ్చి తల్లీబిడ్డలు ఇద్దరినీ ఢీకొనడంతో వారు కింద పడ్డారు. మరుక్షణమే బుడ్డోడు తేరుకొని తన తల్లికి ఏమైందో అని గాబరగా చూశాడు. అంతే ఒక్కసారిగా తనలో కోపం పెరిగిపోయింది..వెంటనే సినిమాలో హీరోలా పైకి లేచి తమ ప్రమాదానికి కారణమైన కారును కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా కారులో కూర్చున్న వ్యక్తిని ధైర్యంగా ఎదిరించాడు. అయితే కారులో వ్యక్తి బయటకు రావడంతో మళ్లీ తన తల్లి దగ్గరికి వెళ్లాడు.కారు నడిపిన వ్యక్తి కూడా బుడ్డోడి ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. అదే కారులోనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos