పల్లెటూరి పిలగాడి సైకిల్ నైపుణ్యం

ఇది సోషల్ మీడియా యుగం. ఎక్కడ కొత్తదనం కనిపించినా, ఎక్కడ వింతలు, విడ్డూరాలు చోటుచేసుకున్నా నిమిషాల్లో ప్రపంచమంతా పాకిపోతుంది. చూడగానే ఔరా అనిపించేలా ఉండాలంతే… అది ఏ ప్రాంతం, ఏ భాష అనేది నెటిజన్లకు అవసరంలేదు. అత్యధికులకు నచ్చిన వీడియో కొద్దిసేపట్లోనే వైరల్ అవుతుంది. ఈ వీడియో కూడా అలాంటిదే.
ఓ గ్రామీణ ప్రాంతంలో చిత్రీకరించిన వీడియో. ఓ కుర్రాడు నెత్తిమీద గడ్డిమోపు పెట్టుకుని, దాన్ని చేతులతో పట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. ఆ కుర్రాడు సైకిల్ హ్యాండిల్ ను చేతులతో పట్టుకోకపోయినా, ఎంతో నేర్పుగా బ్యాలెన్స్ చేసుకుంటూ తారు రోడ్డుపై రివ్వున దూసుకెళ్లాడు. అతడి వెనుకగా వస్తున్న ఓ వాహనంలోని వారు దీన్ని తమ ఫోనులో వీడియోగా చిత్రీకరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ గడ్డిమోపు-సైకిల్ వీడియో సందడి చేస్తోంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos