దర్శకులను విసిగిస్తున్న విజయ్ దేవరకొండ!

  • In Film
  • June 20, 2019
  • 112 Views
దర్శకులను విసిగిస్తున్న విజయ్ దేవరకొండ!

అర్జున్‌రెడ్డి,గీతగోవిందం చిత్రాలతో తెలుగుతో పాటు జాతీయస్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ మితిమీరిన జాగ్రత్తలతో దర్శకులను విసిగిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.చిత్రీకరణ సమయంలో దర్శకత్వం,ఎడిటింగ్‌లలో కూడా విజయ్‌ దేవరకొండ జోక్యం ఎక్కువైందని దీంతో దర్శకులు విజయ్‌ తీరుతో అసహనంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో సినిమా వరకు దర్శకుడికి వదిలేసి, మార్కెటింగ్ విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అయ్యే విజయ్ దేవరకొండ ఇప్పుడు దర్శకుల పనిలోనూ వేలు పడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.’గీత గోవిందం’ సినిమా తరువాత విజయ్ క్రేజ్ పెరిగిన సంగతి సంగతి తెలిసిందే. అందుకే సినిమాల విషయంలో మరింత జాగ్రత్త పెరిగిపోయి దర్శకుడు చేయాల్సిన పని కూడా తనే చేస్తున్నాడట. కొత్త దర్శకుడు భరత్ కమ్మ.. విజయ్ హీరోగా ‘డియర్ కామ్రేడ్’ సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఏ సీన్ ఉంచాలి..? ఏది తీసేయాలనే విషయాన్ని దేవరకొండ డిసైడ్ చేస్తున్నాడట. విజయ్ మీద నమ్మకంతో నిర్మాతలు కూడా అతడిని ఏమీ అనడం లేదట. దీంతో కొత్త దర్శకుడు భరత్ కమ్మ బాగా విసిగిపోయాడట. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు దూరంగా ఉంటున్నాడట.డైరెక్టర్ అలిగాడని విజయ్ కి అర్ధమైనా.. అదేమీ పట్టించుకోకుండా తన పని చేసుకుంటున్నాడట. అంతేకాదు.. ఈరోజు ఇంతవరకు పనిచేశామని  డైరెక్టర్ కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడట. హీరోగా మారి కొంతకాలం కాకముందే విజయ్ ఈ రేంజ్ లో సినిమాను కెలికేస్తుండడం కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది!

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos