నిర్భయ దోషులను ఉరి తీసే అవకాశం కోసం రక్తంతో లేఖ..

నిర్భయ దోషులను ఉరి తీసే అవకాశం కోసం రక్తంతో లేఖ..

అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటనలో నిందితులను సోమవారం ఉరి తీయనున్న నేపథ్యంలో దేశంలో ప్రతి ఒక్కరూ సోమవారం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక నిందితులను ఉరి తీయడానికి తలారీలు లేరనే విషయం బయటకు రావడంతో కొద్ది రోజులుగా నిందితులను ఉరి తీసే అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే ఎంతోమంది విన్నవించారు.ఇద్దరు విదేశీయులు సైతం నిందితులను ఉరి తీసే అవకాశం ఇవ్వాలంటూ లేఖ ద్వారా కోరారు.ఆ దోషులను మహిళే ఉరితీయాలని అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్ కోరారు. మేరకు ఆమె కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు తన రక్తంతో లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లేఖను మీడియాకు చూపారు.నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న నలుగురి ఉరిశిక్షను మహిళతోనే అమలు జరిపించాల్సిందిగా వర్తికా సింగ్ పేర్కొన్నారు.లేదంటే ఉరితీతకు తలారీగా తనను నియమించాలని లేఖలో కోరారు. దీని ద్వారా ఇటువంటి శిక్షలు మహిళ కూడా వేయగలదన్న సందేశాన్ని కూడా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. మహిళా నటులు, ఎంపీలు కూడా తనకు మద్దతు తెలపాలని ఆమె కోరారు. చర్యతో సమాజంలో మార్పు వస్తుందన్న ఆశిస్తున్నట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos