V క్లైమాక్స్‌ అదిరిపోయేలా ఉంటుందట..

  • In Film
  • February 24, 2020
  • 119 Views
V క్లైమాక్స్‌ అదిరిపోయేలా ఉంటుందట..

తమ ఇద్దరికి హిట్‌ ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో హీరోలు నాని,సుధీర్‌బాబులు కలసి నటిస్తున్న V చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.మొదటిసారి నాని ఈ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తుండడంతో చిత్రంపై అంచనాలు ఆ రేంజులో ఉన్నాయి.పైగా మొదటినుంచి విభిన్న కథలు,సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలనే తెరకెక్కిస్తున్న ఇంద్రగంటి ఈసారి మరింత థ్రిల్లింగ్‌ కథతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ ద్వారా తెలియడంతో ఆతృత,ఉత్కంఠత పెరిగింది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వెలువడ్డ ఓ వార్త మరింత ఉత్కంఠ రేపుతోంది.హీరోగా దూసుకుపోతున్న నానీ, విలన్ పాత్రను చేయడానికి కారణం కొత్తగా కనిపించడం కోసమేనని అనుకున్నారు.కానీ పాత్రకి సంబంధించిన ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఉందట. అది క్లైమాక్స్ లో రివీల్ అవుతుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.ఆడియన్స్ ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. కారణంగానే పాత్రను చేయడానికి నాని అంగీకరించాడని చెబుతున్నారు. ఇది కచ్చితంగా సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచే విషయమే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos