మాట తప్పిన భాజపా

మాట తప్పిన భాజపా

ముంబై:మహా వికాస్ ఆఘాడీ కూటమిని అనైతికం అనడం అసమంజసమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. పార్టీ అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ముఖాముఖిలో సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాల్ని వ్యక్తీకరించారు. ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేసిన తాము ‘ఏమైనా చంద్రుణ్ని, చుక్కల్ని తెచ్చిమ్మని భాజపాను కోరిందా’ని చురకలంటించారు. ఎన్నికల అనంతరం సంభవించిన పరిణా మాలకు భాజపాయే కారణమని వివరించారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన హిందుత్వ సిద్ధాంతాలను శివసేన త్యజిం చినట్లు కాదన్నారు. గతంలో భాజపా అనేక సార్లు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు అధికా రాన్ని పంచుకు నేందుకు అంగీకరించిన భాజపా ఫలితాల అనంతరం మాటమార్చిందన్నారు. శివ సైనికుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తన తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చమని మాత్రమే భాజపాను అడిగాం. చుక్కల్ని, చంద్రుణి అడగలేదని చురకలంటించారు. భాజపా శివసేనకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఉంటే తన స్థానంలో మరో శివ సైనికుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండేవారన్నారు. లోక్సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమైనా భాజపా అభ్యర్థన మేరకు కలిసి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos