ఉత్తర్ ​ప్రదేశ్​ అసెంబ్లీ వెబ్​సైట్‌ హ్యాక్

లఖ్నవ్: ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ అధికారిక వెబ్సైట్ బుధవారం హ్యాక్ అయింది. అందులో అభ్యంతరకర పోస్ట్లు పెట్టారు.’ అని డీఈఎస్సీఓ అసిస్టెంట్ మేనేజర్ రామశంకర్ సింగ్ తెలిపారు. ఉత్తర్ప్రదేశ్ డెవలప్మెంట్ సిస్టమ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీఈఎస్సీఓ) చేసిన ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ 2008 కింద కేసు నమోదు చేసినట్లు లఖ్నవూ సైబర్ పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని సైబర్ క్రైం ఏడీజీ రామ్ కుమార్ తెలిపారు. పుణెకు చెందిన టెక్ సర్వీస్ కంపెనీ పర్సి స్టెంట్ లిమిటెడ్ ఈ వెబ్సైట్ను నిర్వహిస్తోంది. ఇటీవల ఈసీ(ఎన్నికల సంఘం) వెబ్సైట్ను హ్యాక్ చేసి, వందలకొద్దీ నకిలీ ఓటర్ ఐడీలను సృష్టించిన 24 ఏళ్ల వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిరోజులకే మళ్లీ అసెంబ్లీ వెబ్సైట్ హ్యాక్ కావడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos