నేను కాకుండా ఇంకెవరు ?: ప్రియాంక గాంధీ

నేను కాకుండా ఇంకెవరు ?: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: ”నేను కాకుండా ఇంకెవరు ఉంటారు?. మీరు ఎక్కడ చూసినా అక్కడ నేనే కనిపిస్తున్నాను కదా..” అని ప్రియాంక గాంధీ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇది. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం యూపీలో అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. అయితే, ఈసారి యువత, మహిళలపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తూ ఎన్నికలకు వెళ్తోంది. తమ పార్టీ వైపు మళ్లీ ప్రజలు చూస్తున్నారని, గెలుపు తమదేననని ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రియాంక సారథ్యం వహిస్తున్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికల ప్రచార బాధ్యతను ప్రియాకం తన భుజాలపై వేసు కున్నారు. యూపీని 1967లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పాలించారు.ఆ తర్వాత తిరిగి 1969 నుంచి 1970 వరకూ కాంగ్రెస్ పాలన సాగింది. కాంగ్రెస్ నేత ఎన్డీ తివారీ ఆ పార్టీ చివరి సీఎం. 1976 నుంచి 1977, 1984 నుంచి 1985, 1988 నుంచి 1989 వరకూ మూడు సార్లు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత ఒక్క కాంగ్రెస్ నేత కూడా రాష్ట్రాన్ని పాలించలేదు. ఈ సారి యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గట్టి ఆశలే పెట్టుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos