యువతే బలం.. కొత్త యూపీని సృష్టిస్తాం

యువతే బలం.. కొత్త యూపీని సృష్టిస్తాం

న్యూ ఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యువత కోసం ప్రత్యేక ఎన్నికల ప్రణాళిక -భర్తీ విధాన్ ను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం ఇక్కడి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను అన్నింటినీ భర్తీ చేయాలని కాంగ్రెస్ తీర్మానించింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో మహిళలకే 8 లక్షలు కేటాయించింది. ఈ సందర్భంగా.. యువతకు మంచి భవిష్యత్తు కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు రాహుల్. యువతను సంప్రదించి వారి దృక్కోణాలు ప్రతిబింబించేలా ఈ ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. ‘ఉత్తర్ప్రదేశ్ యువతకు మంచి భవిష్యత్తు కావాలి. అది కాంగ్రెస్ మాత్రమే సాధ్యం చేయగలదు. మేం విద్వేషాలను వ్యాప్తి చేయబోం. ప్రజలను ఏకం చేస్తాం. యువతను బలంగా తీర్చిదిద్ది.. సరికొత్త ఉత్తర్ప్రదేశ్ను సృష్టిస్తాం’అని రాహుల్ గాంధీ, పేర్కొన్నారు. యువత నిరాశలో ఉన్నారని, నిరుద్యోగమే అతిపెద్ద సమస్య అని ప్రియాంకా గాంధీ అన్నారు. కుల, మత రాజకీయాల జోలికి వెళ్లకుండా రాష్ట్రాభివృద్ధినే కాంగ్రెస్ కోరుకుంటోందని ఆమె అన్నారు.యువత, మహిళలకు పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. కాంగ్రెస్ పోటీచేయనున్న స్థానాల్లో 40 శాతం మహిళలకే అని ఇదివరకే ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos