పంచాయతీ అధ్యక్ష పదవికి ఏకగ్రీవ ఎన్నిక

పంచాయతీ అధ్యక్ష పదవికి ఏకగ్రీవ ఎన్నిక

హొసూరు : బాగలూరు సమీపంలోని ఇచ్చంగూరు పంచాయతీ అధ్యక్షురాలుగా  పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్ల ఉపసంహరణ రోజైన గురువారం ఇద్దరు మహిళలు బరి నుంచి తప్పుకున్నారు. దీంతో పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది. ఆ పంచాయతీలో వార్డు సభ్యులు, యూనియన్‌ కౌన్సిలర్‌ పదవులకు యధావిధిగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 27, 30 తేదీల్లో రాష్ట్రంలో రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.

 

తాజా సమాచారం