యుద్ధ జ్వాల మధ్య పెళ్లి

యుద్ధ జ్వాల  మధ్య  పెళ్లి

హైదరాబాదు: ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఒక్కసారిగా ఉక్రెయిన్‌ ప్రజల దారుణస్థితి అక్కడ చిక్కుకుపోయి ‍స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల మీద అందరి ఫోకస్‌ పడింది. ఉక్రెయిన్‌తో ఇండియాకి ఉన్న సంబంధాలపై చర్చ జరుగుతోంది. భారత విద్యార్థుల తరలింపుకు ఉక్రెయిన్‌తో పాటు అనేక దేశాలు సహకారం అందిస్తున్నాయి. కానీ విపత్కర పరిస్థితికి సరిగ్గా 24 గంటల ముందు ఓ ఉక్రెయిన్‌ యువతిని పెళ్లాడాడు భారతీయుడు.ఉక్రెయిన్‌పై దాడి చేస్తామంటూ గత రెండు నెల లుగా రష్యా హెచ్చరికలు చేస్తూనే ఉంది. లక్షల మంది సైన్యాన్ని ఉక్రెయిన్‌ సరిహద్దుల వెంట మోహరించింది. ఏ క్షణమైన యుద్ధం తప్పదనే పరిస్థితి తీసుకొచ్చింది. యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నా అప్పటికే ప్రేమలో ఉన్న ఉక్రెయిన్‌ అమ్మాయి లిబ్యువ్‌ హైదరాబాదీ అబ్బాయి ప్రతీక్‌లు వెనుకడుగు వేయలేదు.ఆందోళనలు చుట్టు ముట్టినా ఇరు పక్షలా కుటుంబ సభ్యులను ఒప్పించారు. యుద్దం ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ఇద్దరు ఉక్రెయిన్‌లో వివాహం చేసుకున్నారు. అదే రోజు ఇండి యాకి పయ నమయ్యారు. వీరు ఇటు రావడం ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అంటే 2022 ఫిబ్రవరి 24 ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌ అంతా నో ఫ్లై జోన్‌గా మారిపోయింది.క్షేమంగా హైదరాబాద్‌ చేరుకున్న కొత్త జంట 2022 ఫిబ్రవరి 27న తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితుల కోసం నగరంలో ఘనంగా రిసెప్షన్‌​ నిర్వహించారు. యుద్దం మొదలైనా తగ్గేదేలే అని ఈ ప్రేమికులు నిరూపించారు. ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నా తర్వలోనే ఉక్రెయిన్‌కి వెళ్తామంటున్నారీ నూతన దంపతులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos