ఐపీఎల్‌ టీముల్లాగే అన్నాడీఎంకేలో జట్లు

ఐపీఎల్‌ టీముల్లాగే అన్నాడీఎంకేలో జట్లు

చెన్నై: ఐపీఎల్ మ్యాచ్లో పోటీపడే టీముల్లాగే అన్నాడీఎంకేలో కూడా పలు పేర్లతో టీములున్నాయని మంత్రి ఉదయనిధి వ్యాఖ్యానించారు. తేని లోక్సభ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి తంగ తమిళ్సెల్వన్కు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు. నూతన విద్యా విధానం ద్వారా మళ్లీ కుల విద్యను అమలుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విధానం అమల్లోకి నిమ్నజాతుల పిల్లలు చదువుకోరాదు, ఉద్యోగాలకు పోరాదు అన్న కోణంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. తమిళ భాషాభివృద్ధికి రూపాయ కూడా అందజేయని ప్రధాని మోదీ, రాష్ట్రంలో నిర్వహించే ప్రచారసభల్లో తమిళం, తిరుక్కురల్, తమిళ సాహితీవేత్తల గురించి పొగుడుతూ మాట్లాడుతుంటారని, ఇది కేవలం ఓట్లు రాబట్టుకొనేందుకేనని విమర్శించారు. చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా పలు క్రికెట్ జట్లు ఐపీఎల్ మ్యాచ్లో పాల్గొంటున్నాయని, వీటిలో ఉన్న క్రికెటర్లు ఇండియా జట్టులో తరఫున ఒకటిగా ఆడతారన్నారు. ఇదు తరహాలో అన్నాడీఎంకేలో ఈపీఎస్, ఓపీఎస్, మోదీ, జె.దీప, టీటీవీ దినకరన, వీకే శశికళ పేర్లతో జట్లు ఉన్నాయని ఉదయనిధి చమత్కరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos