టైఫాయిడ్ వ్యాక్సిన్‌తో అంటు రోగాల నుంచి రక్షణ

టైఫాయిడ్ వ్యాక్సిన్‌తో అంటు రోగాల నుంచి రక్షణ

టైఫాయిడ్ చుక్క మందుతో ఇతరత్రా అంటు వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని బ్రిటన్లోని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. నోటి ద్వారా ఈ చుక్క మందును తీసుకుంటారు. సాల్మోనెల్లా టైఫి అనే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ప్రపంచం మొత్తమ్మీద ఏటా 1.8 కోట్ల మంది ఈ జ్వరానికి గురవుతుంటే, లక్షల మంది చనిపోతున్నారు. టీవై21ఏ అనే వాక్సిన్ రోగ నిరోధక శక్తిని పెంచి రోగి టైపాయిడ్ నుంచి బయటపడేలా చేస్తుంది. ఈ వాక్సిన్లు తక్కువ ధరకే లభిస్తాయి. ఇతర సంక్రమణ వ్యాధుల నుంచి కూడా ఈ వాక్సిన్ ద్వారా రక్షణ లభిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos