ట్విటర్‌కు మరోసారి నోటీసులు

ట్విటర్‌కు మరోసారి నోటీసులు

న్యూ ఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనల అమలుపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 18న హాజరుకావాలని ట్విటర్కు పార్లమెంట్ స్థాయి సమితి తాఖీదులు జారీ చేసింది. కొత్త ఐటీ నిబంధనలు పాటించాలని పదే పదే హెచ్చరించినా తగిన వివరణ ఇవ్వడంలో ట్విటర్ విఫలమైందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లోని సైబర్ లా గ్రూప్ కోఆర్డినేటర్ రాకేశ్ మహేశ్వరి సిన లేఖలో పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వార్తలను దుర్వినియోగంపై కమిటీ తాజా నోటీసులిచ్చింది. జూన్ 18, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, ఫేక్న్యూస్ నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos