బంగారం తరలింపు బాధ్యత బ్యాంక్ దే

బంగారం తరలింపు బాధ్యత బ్యాంక్ దే

తిరుమల: బంగారం తరలింపు విషయంలో పూర్తి బాధ్యత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ దేనని తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్ తెలిపారు.సోమవార ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘గోల్డ్‌ డిపాజిట్ పథకం 2000 ఏప్రిల్‌ 1న ప్రారంభమైంది. ఎస్‌బీఐలో 5,387 కిలోల బంగారం ఉంది. పీపీఎన్‌బీలో 1381 కిలోల బంగారం ఉంది. తితిదేకు సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉంది. 2016 ఏప్రిల్‌లో పీఎన్‌బీలో 1381 కిలోల బంగారం వేశాం. అది 2019 ఏప్రిల్‌ 18కి గడువు ముగిసింది.దీనిపై మార్చి 27నే పీఎన్‌బీకి లేఖ రాశాం. బంగారం తరలింపు అంశం పూర్తి బాధ్యత పీఎన్‌బీదే. పీఎన్‌బీ వచ్చికోశాగారంలో ఇస్తే అది తితిదే బంగారం అవుతుంది. ఈసీ స్వాధీనం చేసుకున్నపుడు దస్త్రాలు ఉన్నాయని పీఎన్‌బీ మాతో చెప్పింది. ఈసీ అధికారులకు దస్త్రాలు చూపామని ఫోన్‌లో చెప్పారు. వాళ్లు ఈసీకి ఎలాంటి దస్త్రాలు చూపారో మాకు తెలియదు. మేం మార్చి 27న లేఖ రాసినపుడు ఏప్రిల్‌ 18న రావాలని చెప్పాం. ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌ 20న బంగారం అందించారు. బంగారం ఎలా తరలిస్తారో.. ఏ వాహనంలో తీసుకొస్తారో మనకెలా తెలుస్తుంది. బంగారం మాకు వచ్చేంత వరకు మిగిలిన విషయాలు అవసరం లేదు. బంగారం ఎలా వస్తే మాకేంటి? మాకు బంగారం అందిందా లేదా అనేది ముఖ్యం. వడ్డీ రేట్లు గోల్డ్‌ డిపాజిట్‌ స్కీ్మ్‌లో బాగా వస్తాయా లేదా అనేది బోర్డు నిర్ణయం. కేజీ బంగారం డిపాజిట్‌ చేయాలన్నా బోర్డు నిర్ణయం తీసుకుంటాం. తితిదేకు ఏ విధంగా ఆదాయం ఎక్కువగా వస్తుందో వంటి నిర్ణయాలు బోర్డు పని. బంగారం విషయంలో తితిదే బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తామంటే ఎలాంటి అభ్యంతరం లేద’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos