అధికారం నిలుపుకోవడానికి చంద్రబాబు పాట్లు

అధికారం నిలుపుకోవడానికి చంద్రబాబు పాట్లు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారాన్ని నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.గత ఎన్నికల్లో బీజేపీ,పవన్ కళ్యాణ్ మద్దతుతో చేజిక్కించుకున్నఅధికారాన్ని ఈ సారి కాంగ్రెస్ మద్దతుతో నిలుపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన బీజేపీ,పవన్ కళ్యాణ్ ఇద్దరు దూరం కావడంతో కాంగ్రెసుతో కలసి ఎన్నికలు ఎదుర్కోవడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.చంద్రబాబు నాయుడి తాజా ఢిల్లీ పర్యటనతో కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఏపీలో కూడా ఓకే అయినట్టుగా తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ తో కలిసి పోటీచేయడమా, కాంగ్రెస్ ను పక్కనపెట్టి పోటీ చేయడమా.. అనే అంశంపై చంద్రబాబు నాయుడి కసరత్తు పూర్తి అయ్యిందని, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడానికే చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.ఇటీవలే ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీడీపీతో పొత్తు అవసరమే అంటూ.. ఏయే స్థానాలు కావాలో కూడా ఒక నివేదికను రాహుల్ గాంధీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఆ నివేదిక రాహుల్ ద్వారా చంద్రబాబుకు చేరినట్టుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ పాతిక ఎమ్మెల్యే సీట్లు, ఐదు ఎంపీ సీట్లను కోరుతున్నట్టుగా సమాచారం. వీటిలో కొన్నింటికి చంద్రబాబు నో చెప్పినా.. తెలంగాణలో టీడీపీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లకు రెట్టింపు స్థాయిలో అయితే ఏపీలో కాంగ్రెస్ కు టీడీపీ టికెట్లను కేటాయించాల్సిన డీల్ అయితే ఒకటి ఉందని తెలుస్తోంది.కాగా గత ఏడాది కాంగ్రెస్ తో కలసి కూటమిగా ఏర్పడి తెలంగాణాలో పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న చంద్రబాబు అదే వ్యూహాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు రాజాజీయా విశ్లేషకులతో పాటు టీడీపీ శ్రేణుల్ని సైతం ఒకింత ఆశ్యర్యానికి గురి చేస్తోంది.ఇక రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఏపీ భవన్‌లో వీరి భేటీ జరిగింది. బీజేపీయేతర కూటమి కోసం ఇటీవల చంద్రబాబు వరుసగా జాతీయ నేతలను కలుస్తోన్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos