నకిలీ విత్తనాలతో టమోటా రైతు కుదేలు

నకిలీ విత్తనాలతో టమోటా రైతు కుదేలు

హోసూరు : నకిలీ టమోటా విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలోని దొడ్డి గ్రామంలో రాజప్ప అనే రైతు రెండు ఎకరాలలో టమోటా పంటను సాగు చేశారు. పంట బాగా పెరిగి కాయ దశకు వచ్చింది. చెట్టుకు  కాసిన కాయలు వంకరగా ఉండడంతో రోగం వచ్చిందని విలువైన మందులు పిచికారి చేశారు.  అయినా ప్రయోజనం లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులకు చూపించారు. కాయలను పరీక్షించిన అధికారులు నకిలీ విత్తనాల వల్ల పంట ఉత్పత్తి సరిగ్గా లేదని తెలిపారు. ప్రస్తుతం హోసూరు మార్కెట్లో కిలో టమోటా ధర రూ.50 పలుకుతోంది. టమోటాలు సరిగ్గా కాయకపోవడంతో రెండు ఎకరాల్లో రూ.40 లక్షల వరకు నష్టపోయానని రాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని వాపోయారు. హోసూరు ప్రాంతంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై చర్యలు చేపట్టి, రైతులను ఆదుకోవాలని రాజప్ప డిమాండ్ చేశారు. సూలగిరి ప్రాంతంలో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన ఎంతో మంది రైతులు తనలాగా తీవ్రంగా నష్టపోయారని రాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos