పేటీఎంపై జియో ఆగ్రహం

పేటీఎంపై జియో ఆగ్రహం

ముంబై : మోస పూరిత కాల్స్ కు టెలికం సంస్థల్ని బాధ్యుల్ని చేసి నందుకు పేటీఎంపై జియో ఆగ్రహించింది. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూ నికేషన్స్ టెలికాం ఆపరేటర్లయిన జియో, వొడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ (ఎంటీఎన్ఎల్), బీఎస్ఎ న్ఎల్ లతో పాటు ట్రాయ్, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. మొబైల్ వినియోగదార్లను ఉచ్చులోకి లాగేందుకు చేసే మోస పూరిత కాల్స్ ను సదరు టెలికాం సంస్థలు అడ్డు కోవడంలేదని పేటీఎం న్యాయ స్థానానికి దాఖలు చేసిన వ్యాజ్యంలో ఫిర్యాదు చేసింది. దీనికి జియో వివరణ ఇచ్చింది. ఫోన్ కాల్స్, సందేశాలకు సంబంధించి జరిగే అక్రమాలకు తాము ఎలా బాధ్యత వహిస్తామని జియో పేర్కొంది. తాము మధ్యస్థులమేనని, సమాచార వాహకంగా ఉండే తాము ఐటీ యాక్ట్ 79 ప్రకారం ఈ రకమైన వ్యవహారాలకు బాధ్యత వహించలేమని, అందుకు తమకు మినహాయింపు కూడా ఉందని వివరించింది. రెండు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణను జూన్ 24కి వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos