29 న ట్రాక్టర్ల మార్చ్

29 న  ట్రాక్టర్ల  మార్చ్

కౌశంబి: దేశ రాజధానిలో ఈ నెల 29 న 60 ట్రాక్టర్లతో పార్లమెంటు వరకూ మార్చ్ నిర్వహించనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ బుధవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ‘పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడం సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం ట్రాక్టర్స్ మార్చ్ లక్ష్యం. ప్రభుత్వం తెరిచి ఉంచిన రోడ్ల మీదుగానే ట్రాక్టర్లు పార్లమెంటు వరకూ వెళ్తాయి. మేము రోడ్లు దిగ్బంధం చేస్తున్నామనే ఆరోపణలకు తావీయం. రోడ్లు దిగ్బంధించడం మా ఉద్యమం కాదు. ప్రభుత్వంతో చర్చించడమే మా ఉద్యమం ఉద్దేశం. మేము నేరుగా పార్లమెంటుకు వెళ్తాం. సుమారు వెయ్యి మంది వరకూ పార్లమెంటుకు వెళ్తుం. కనీస మద్దతు ధరపై ప్రభుత్వ స్పందన గురించి వేచి చూస్తున్నాం. ఏడాదిగా సాగించిన రైతు నిరసనల్లో 750 వరకు రైతులు చనిపోవడానికి కేంద్రం బాధ్యత తీసుకోవాల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos