తళి ఎడిఎంకె అభ్యర్థిత్వం కోసం ముగ్గురి పోటీ

తళి ఎడిఎంకె అభ్యర్థిత్వం కోసం ముగ్గురి పోటీ

హోసూరు : ఎడిఎంకె పార్టీ నుంచి  తళి శాసన సభ నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని ముగ్గురు ప్రముఖులు ఆశిస్తున్నారు.  శాసన సభ ఎన్నికల కాక రాజుకుంటున్న వేళ… అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు తలమునకలై ఉన్నాయి. పాలక, ప్రతిపక్షాలైన ఎడిఎంకె, డిఎంకె పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాయి. కృష్ణగిరిజిల్లాలో ఆరు నియోజక వర్గాలకు గాను హోసూరు, బరుగూరు నియోజక వర్గాలకు తప్ప

మిగిలిన నాలుగు నియోజక వర్గాలలో ఎడిఎంకె పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హోసూరు స్థానాన్ని బిజెపికి కేటాయించినట్లు వినవస్తుండగా, బరుగూరు నియోజక వర్గాన్ని పిఎంకె పార్టీకి కేటాయించినట్లు సమాచారం. ఇకపోతే వేపనపల్లికి సీనియర్ నాయకుడు కెపిఎం, ఊతంగేరిలో మనోరంజితం, కృష్ణగిరి స్థానం కోసం అశోక్ కుమార్, గోవిందరాజలు పోటీ పడుతుండగా అశోక్ కుమార్‌కే టికెట్ దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. తళి నియోజకవర్గంలో పోటీ చేయడానికి ముగ్గురు ఆసక్తి చూపుతున్నారు. వీరిలోఎడిఎంకె పార్టీ హోసూరు పట్టణ కార్యదర్శి పాల నారాయణ,

బారందురు చంద్రశేఖర్,ఇరుదుకోటకు చెందిన రామమూర్తి  ఉన్నారు. పాల నారాయణ, బారందురు చంద్రశేఖర్‌లలో   ఒకరికి తళి టికెట్ దక్కే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా పాల నారాయణ పేరునే ఎడిఎంకె పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కృష్ణగిరి జిల్లా ఎడిఎంకె అభ్యర్థుల జాబితా సిద్ధమైందని, అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని పార్టీ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos