గుండెపోటు లక్షణాలు ఇలా ఉంటాయి..

గుండెపోటు లక్షణాలు ఇలా ఉంటాయి..

గుండెలో మంటగా అనిపించినా.. నొప్పి వచ్చినా కొందరు చాలా తేలికగా తీసుకంటూ ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం సరికాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గుండె చుట్టూ ఫ్లూయిడ్ చేరుకొని గుండెకు రక్త సరఫరా జరుగకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఈ పరిస్థితినే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్.. లేదా మన భాషలో చెప్పాలంటే ‘ హార్ట్ ఫెయిల్యూర్’ ఈ సంకేతాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

హార్ట్ ఫెయిల్యూర్ మొదటి దశలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలూ కనపడవు. ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేసినా ఇబ్బండి ఉండదు. ఈ దశలో గుర్తించాలంటే మనం రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవాల్సిందే..!

ఒక వేళ మనకు హార్ట్ ఫెయిల్యూర్ రెండో స్టేజీలో ఉంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు నీరసం వస్తుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది.

చిన్న పని చేసినా ఆయాసం వస్తుంది.
ఈ స్టేజ్ లో ట్రీట్మెంట్ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ తరహా లక్షణాలు ఉంటే మీరు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.

ఈ స్టేజ్ లో పని చేయకుండా కూర్చొని ఉన్నా ఆయాసం ఉంటుంది. వెంటనే డాక్టర్ ను సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి. తక్షణం కనిపించే లక్షణాలు ఇవే.. నీరసం కాళ్ళూ పాదాల వాపు బరువు పెరగడంఎక్కువ సార్లు బాత్రూమ్ కి వెళ్ళాల్సి రావడం హృదయస్పందన సరిగ్గా లేకపోవడం విపరీతమైన దగ్గు ఆయాసం ఇది పల్మనరీ ఎడీమా ని కూడా సూచించవచ్చు

చికిత్స ఉందా..?
పట్రీట్మెంట్ పేషెంట్ యొక్క మెడికల్ కండిషన్ ని బట్టీ ఇతరత్రా ఉన్న ఆరోగ్ సమస్యలను బట్టీ డిసైడ్ చేస్తారు. అవసరాన్ని బట్టి మెడిసిన్స్ సర్జరీలను ఎంచుకుంటారు.

జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి మీ దరి చేరదు
స్మోకింగ్ అలవాటున్న వారు వెంటనే ఆపేయండి.. పండ్లూ కూరగాయలూ హోల్ గ్రెయిన్స్ మజ్జిగ తరచూ తీసుకోండి. ఉప్పు చక్కెర వీలైనంత తగ్గంచండి. రోజూ కనీసం 45 నిమిషాలపాటు వ్యాయామం చేయండి. ఓకవేళ మీరు అధిక బరువు ఉంటే వెంటనే తగ్గించుకోండి. ఆల్కాహాల్ పూర్తిగా తగ్గించండి.. తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. అయితే ఏ మాత్రం లక్షణాలు కనిపించినా డాక్టర్ సంప్రదిందించాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos