మోదీకి విదేశీ పార్లమెంట్లే మక్కువ

మోదీకి  విదేశీ పార్లమెంట్లే మక్కువ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ మన పార్లమెంటులో కంటే విదేశీ పార్లమెంట్లలోనే ఎక్కువగా మాట్లాడతారని కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు శశిథరూర్ వ్యాఖ్యానించారు. నగరంలో మంగళవారం జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో త తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీల పనితీరు, ప్రజాస్వామ్యం, ప్రజా స్వామ్య సంస్థలు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అశాంలపై పోలికను ప్రస్తావించారు. మోదీ విదేశీ పార్లమెంట్లలోనే ఎక్కువ ప్రసంగాలిస్తారని, ఇందుకు నెహ్రూ పూర్తిగా భిన్న మన్నారు. ఇండియా-చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధం జరిగినపుడు జవాహర్ లాల్ నెహ్రూ పార్లమెంటు సమావేశానికి పిలుపునిచ్చి, ఆ అంశంపై చర్చించారు. ఇప్పు డుఅలా కాదు.ఇండియా-చైనా మధ్య సరిహద్దు అంశాలకు సబంధించిన ప్రశ్నలు లేవనెత్తడాన్ని కూడా అనుమతించడం లేదు. గల్వాన్ లోయలో ఏమి జరిగిందని ప్రశ్నించారు. 21 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినా దీనిపై లోక్సభ, రాజ్యసభల్లో చర్చే జరగలేదని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos