నేడు ఏడారి.. నాడు జనవాసం

నేడు ఏడారి.. నాడు జనవాసం

జైపూర్: లక్షా డెభ్బై రెండు వేల(1,72,000) ఏళ్ల కిందట బికనీర్ సమీపంలో థార్ ఎడారిలో ప్రవహించి కాల ప్రవాహంలో కనుమరుగైన “నది”ఆనవాళ్లను పరిశోధకులు ఆధారాలతో సహా కనుగొన్నారు. ‘ఈ ప్రాంతంలో మానవుల ఆవాసానికి, నాగరికత అభివృద్ధికి ఈ నది ఒక జీవన నాడిగా ఉండొచ్చ’ని జర్మనీలోని ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఈఆర్ కోల్కతా పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో తేలింది. పరిశోధన వివరాలు క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సెంట్రల్ థార్ ఎడారిలోని నల్ క్వారీ, ఇతర ప్రాంతాల్లో జరిపిన పరిశోధనలు నది ప్రవాహ దశను సూచించాయి. రాతి యుగం నాటి మానవులు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న దాని కంటే భిన్నమైన థార్ ఎడారి ప్రకృతిలో నివసించినట్లు తెలుస్తోంది. కనుమరుగైన నది సమీప ఆధునిక నదికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos