సైన్యంలో తెలుగు రాష్ట్రాల స్థానం ఎంతంటే..

సైన్యంలో తెలుగు రాష్ట్రాల స్థానం ఎంతంటే..

దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికుల త్యాగాలు,ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.మరి మన దేశంలో సైనికులు పేరు చెప్పగానే ఎక్కువగా పంజాబ్ వాళ్ల పేర్లు గుర్తు వస్తాయి, అక్కడ అన్నీ కేడర్లలో ఎక్కువ అధికారులు వారే ఉంటారు.మరి నిజంగా పంజాబ్ నుంచే ఎక్కువ మంది సైనికులు ఉన్నారా అనేది చూస్తే..సిపాయి నుండి బ్రిగేడియర్ స్థాయి వరకు మిలటరీలో వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.. ఇది కాదు అనలేని మాట. ఇక పంజాబ్ లో పిల్లలు చిన్నతనం నుంచి నేను సైన్యంలోకి వెళతా అంటారు `.తల్లిదండ్రులు కూడా వారిని ప్రొత్సహిస్తారు.మన దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం ఆర్మీలో 20% మంది సైన్యంలో ఉండగా రాజస్థాన్ 7.9 %,పంజాబ్ నుంచి 7.6%,మహారాష్ట్ర నుంచి 7.3% మంది ఉన్నారు.ఈ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ స్థానంలో ఉండగా తెలంగాణ స్థానం టాప్ 15 లో కూడా లేకపోవడం గమనార్హం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos