అమ్మభాష కు ఆస్ట్రేలియా ఆదరణ

అమ్మభాష కు ఆస్ట్రేలియా ఆదరణ

హైదరాబాదు: మనం అటక ఎకిస్తున్న అమ్మభాష తెలుగుకు ఆస్ట్రేలియా ఆదరణ లభించింది. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠ శాలల్లో తెలుగును ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకోవచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఇంకా తెలుగును ఐచ్ఛికం చేసుకున్న వారికి ఉత్తీ ర్ణతలో ఐదు పాయింట్లు అదనంగా ఇస్తారు. శాశ్వత నివాసం కోసమూ తెలుగు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ అక్రిడిటేషన్ అథారిటీ ఫర్ ట్రాన్సి లేటర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ (నాటి) నిర్వహించే పరీక్ష రాసిన వారికీ తెలుగుకు 5 పాయింట్లు అదనంగా ఇస్తారు. ఆస్ట్రేలియాలోని సుమారు లక్ష మందికి పైగా తెలుగు వాళ్లున్నారు. ఉన్నత చదువులు, ఉపాధి కోసం క్కడికి వెళ్లే తెలుగు వారికి చక్కటి అవకాశమని ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య వ్యవస్థాపకులు మల్లికేశ్వ ర్రావు కొంచాడ తెలిపారు. తెలుగు సంఘాలు తెలుగు బోధనకు మన బడి వంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి.ఇకపై వాటి అవసరం ఉండబోదన్నారు. హిందీ, పంజాబీ,తమిళ భాషల్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos