ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కెసిఆర్ హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కెసిఆర్ హెచ్చరిక..

కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ సహా ఇతర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఇకనైనా ఆపాలని.. లేదంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ – పెద్ద మరూర్ వద్ద బాబ్లీ ప్రాజెక్ట్ తరహాలో బ్యారేజీ నిర్మించి తీరుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నీటి వాటాల విషయంలో గతంలో తెలంగాణకు అన్యాయం జరిగినందునే తెలంగాణ ఉద్యమం పుట్టింది, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేసిన కేసీఆర్.. ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రం తరహాలో ఏపీ తన పద్ధతిని మార్చుకోకపోతే దాని పర్యావసనాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు. మంగళవారం కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలుచేశారు.ఈ సందర్భంగా నదీ జలాల విషయంలో ప్రస్తుత ఏపీ సర్కార్ కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రం అవలంభించిన విధానాలనే అనుసరిస్తోందని మండిపడిన సీఎం కేసీఆర్ అలంపూర్ – పెద్ద మరూర్ వద్ద తెలంగాణ సర్కార్ బ్యారేజీ నిర్మించడం జరిగిందంటే, అందులోంచి రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని హెచ్చరించారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తే కుదరదని తేల్చిచెప్పిన కేసీఆర్.. అంతర్రాష్ట్ర నదీజలాల్లో న్యాయంగా రాష్ట్రానికి లభించే వాటాను పొందే హక్కు తెలంగాణకు ఉందని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos