ఆ గ్రామం ఎప్పుడూ ఎర్రజెండాదే: తమ్మినేని

ఆ గ్రామం ఎప్పుడూ ఎర్రజెండాదే: తమ్మినేని

ఖమ్మం: తెల్దారుపల్లి గ్రామంలో ఎప్పుడూ ఎగిరేది ఎర్రజెండానే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండల పరిధిలోని తెల్దారుపల్లి పంచాయతీకి నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెల్దారుపల్లి గ్రామంలో ఎర్రజెండాను ఇబ్బందులకు గురి చేసేందుకు కొంతమంది అసాంఘిక శక్తులు కుట్రలు పన్నినా అది సాధ్యపడలేదన్నారు. ప్రజలంతా ఎర్రజెండా వైపు ఉండటం చూసి ఓర్వలేక కొన్ని శక్తులు కుట్రలు పన్నాయన్నారు. అరవై ఏళ్లుగా గ్రామానికి ఉన్న ఏకగ్రీవ చరిత్రను తెల్దారుపల్లి ప్రజలు మరలా పునరావృతం చేశారని గుర్తుచేశారు. ఇదే ఒరవడిని కొనసాగించి భవిష్యత్తులో కూడా తెల్దారుపల్లిలో ఎర్రజెండా రెపరెపలాడాలన్నారు. గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే ఎన్ని శక్తులు ఏకమైనా తిప్పికొట్టవచ్చన్నారు. కాగా.. సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు బండి రమేశ్‌ తదితరులు నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌గా ఎన్నికైన సిద్దినేని కోటయ్య, ఉపసర్పంచ్ పాము శ్రీలత, సీపీఎం నాయకులు తుమ్మల శ్రీను, మామిండ్ల సంజీవరెడ్డి, బత్తిని వెంకటేశ్వరరావు, జాలారు సంగయ్య, పి. సంగయ్య, సుదర్శన్‌రెడ్డి, తమ్మినేని కృష్ణయ్య, నాగయ్య, నర్సింహారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos