ఉరి తీసేందుకు సిద్ధం

ఉరి తీసేందుకు సిద్ధం

మీరట్ : నిర్భయ హత్యచారం దోషుల్ని ఉరి తీయనున్న మీరట్ చెరసాల తలారీ పవన్ జల్లాద్ (57) కుటుంబంలో నాలుగు తరాలుగా తలారీగా పని చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతిస్తే నిర్భయ కేసులో నలు గురు దోషులను నేను ఉరి తీస్తా. తీహార్ చెరసాల్లో నా విధిని నిర్వర్తిస్తాను. ఉరి వేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తలారీ ఉద్యోగమంటే ఎంతో ఇష్టం. తీవ్ర నేరాలకు పాల్పడి, సమాజానికి చేటుగా మారిన వారికి ఉరిశిక్ష వేయడం సరైనదేన’ని వ్యాఖ్యానించారు. పవన్ ముత్తాత లక్ష్మణ్ రామ్ బ్రిటీష్ వారి పాలనలో భగత్సింగ్ను ఉరి తీశారు. తాత కల్లూ ఇందిరాగాంధీ హంతకులతో పాటు కరడుకట్టిన ఖైదీలు రంగా, బిల్లాలను ఉరి తీశారు. తండ్రి మమ్మూ కూడా 2011 మే 19వతేదీన మరణించే వరకూ 47 ఏళ్ల పాటు తలారిగా పని చేశాడు. తర్వాత 2013లో పవన్ తలారీగా నియమితులయ్యారు. నితారీ కేసులో దోషి అయిన సురీందర్ కోలికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చడంతో ఉరి తీసే అవకాశాన్ని పవన్ కోల్పోయాడు. తన స్టైఫం డ్ ను రూ. మూడు నుంచి ఐదువేలకు పెంచారని చెప్పారు. తన కుమారుడిని తలారిగా కొనసాగించబోనని పవన్ ఓ ప్రశ్నకు సమా ధానంగా చెప్పారు. తనతోనే తన కుటుంబ వృత్తి అంతరించి పోవాలని భావిస్తున్నట్లు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos