మా వివాహం ఇక్కడ చెల్లదు

మా వివాహం ఇక్కడ చెల్లదు

కోల్కత్తా: ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్జహాన్ తన భర్త నిఖిల్ జైన్ నుంచి విడిపోవడంపై వస్తోన్న వార్తలకు స్పందించారు.‘ భారత చట్టాల ప్రకారం నాకు జరిగిన వివాహం ఇండియాలో చెల్లుబాటు కాదు.టర్కిష్ పద్ధతిలో మా పెళ్లి జరిగింది. మతాంతర వివాహనికి ప్రభుత్వ ధ్రువీకరణ ఉండాలి. నిఖిల్ నుంచి చాలా రోజుల కిందటే విడిపోయాను.భారత చట్టాల ప్రకారం విడాకులు తీసుకునే ప్రశ్న తలెత్తదు. సొంత ఖర్చులతోనే కుటుంబ పోషణ చేస్తున్నా. నాకు ఇతరుల డబ్బు పై వ్యామోహం లేదు. వారి అవసరాల కోసం నా పేరును, డబ్బును వాడుకున్నారు. నావ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించే హక్కు, అవసరం ఇతరులకు లేద’ని ఒక ప్రకటన విడుదల చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos