సుశాంత్ స‌ర‌దాగా గ‌డిపిన క్ష‌ణాలు..

  • In Film
  • June 16, 2020
  • 201 Views
సుశాంత్ స‌ర‌దాగా గ‌డిపిన క్ష‌ణాలు..

బాలీవుడ్‌ యువహీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం అభిమానులకు,తోటి నటీనటులకు ఇప్పటికీ కలగానే ఉంది.అవకాశాలు,స్టార్‌డమ్‌ ఉండగానే సుశాంత్‌ అనుమానాస్పదంగా మరణించడం అంతుచిక్కని మిస్టరీగా ఉంది.ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నా సుశాంత్‌ మరణం వెనుక ఏదో రహస్యం ఉందని కొంతమంది వాదిస్తున్నారు.సుశాంత్‌ మరణానికి బాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థలు,నెపోటిజం కారణమని కొంతమంది నటీనటులు ఆరోపిస్తున్నారు.ఇవన్నీ పక్కనపెడితే అభిమానులు మాత్రం సుశాంత్‌ గత వీడియోలు,ఫోటోలు చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపిన క్ష‌ణాల‌ని సంబంధించిన వీడియోని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఎమోష‌న‌ల్ అవుతున్నారు.గ‌తంలో సుశాంత్ ఓ న‌ది ద‌గ్గ‌ర‌కి త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి వెళ్ళాడు. లైఫ్ జాకెట్ ధ‌రించి అందులో దూకాడు. ఫ్రెండ్స్ కూడా సుశాంత్ సింగ్‌తో క‌లిసి న‌దిలోకి దూకి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఆ నాటి వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, ఇది చూసిన ఫ్యాన్స్ కంట‌త‌డి పెడుతున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos