ప్రజలకు నమ్మకద్రోహం

ప్రజలకు నమ్మకద్రోహం

న్యూఢిల్లీ : మధ్య తరగతి ప్రజలను, వేతనాలపై ఆధారపడి జీవించే వారికి ప్రధాని మోదీ ద్రోహం చేశారని కాంగ్రెస్ పార్టీ బడ్జెట్పై స్పందించింది. ‘అధిక ద్రవ్యోల్బణం, జీతాల్లో కోత వల్ల ప్రజలు నానా కష్టాలు అనుభవిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి, జీతాల్లో కోతలు, నడ్డి విరిచే ద్రవ్యోల్బణం సమయంలో వేతన జీవులు, మధ్య తరగతి వర్గాలు ఉపశమనాన్ని ఆశించాయి. ప్రత్యక్ష పన్నుల చర్యల్లో మరోసారి నిరాశపరిచారన్నారు. ఇది వేతన జీవులకు, మధ్య తరగతి ప్రజలకు నమ్మక ద్రోహం.
ఖాళీ జేబులతో ఉన్న యువత, రైతులు, వేతన జీవులు, పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఇది శూన్య బడ్జెట్ . కొనుగోలు శక్తిని పెంచడానికి, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి లో ఎటువంటి చర్యలు తీసుకోలేద’ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్ లో దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos