మార్చి 15, 16 లలో బ్యాంకుల సమ్మె

మార్చి 15, 16 లలో బ్యాంకుల సమ్మె

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ల అమ్మకాల్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 15, 16 లలో సమ్మె చేయనున్నట్లు తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ సంఘాల సంయుక్త సంఘం-ది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బియు) ప్రకటించాయి. బడ్జెట్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంక్లు, ఒక సాధారణ బీమా కంపెనీని, ఎయిరిండియా, బిపిసిఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడిబిఐ బ్యాంక్, బిఇఎంఎల్ తదితరాల్ని అమ్మనున్నట్లు వెల్లడించారు. గత నాలుగేళ్లలో మోడీ సర్కార్ 14 పిఎస్బిలను విలీనం చేసింది. ఈ చర్యల పట్ల యుఎఫ్బియు సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.సమ్మెలో భాగంగా రాష్ట్ర రాజధానులు, ఇతర కేంద్రాల్లో ధర్నాలు, నల్లబ్యాడ్జీలను ధరించడం, పోస్టర్లను విడుదల చేయడం తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు యుఎఫ్బియు నేతలు వెల్లడించారు. సమ్మెలో ఇతర ప్రభుత్వ రంగ విత్త సంస్థల ఉద్యోగులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. బీమా, గ్రామీణ బ్యాంక్లు కూడా ప్రమాదంలో ఉన్నాయని.. ఆ సంస్థల ఉద్యోగులు కూడా ఉద్యమంలో కలిసి రావాలని విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos